ప్రసార భారతి ఓటీటీ వేవ్స్ వచ్చేసింది... 1 m ago
దేశంలోని అతి పెద్ద ప్రసార సంస్థ ప్రసార భారతి తన ఓటీటీ(ఓవర్ ది టాప్) ఫ్లాట్ ఫామ్ ను తీసుకొచ్చింది. వేవ్స్(Waves) పేరుతో గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఈ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ ను భారత పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ ఆవిష్కరించింది. వీడియో గేమింగ్, ఎంటర్ టైన్మెంట్ కు ఇండియా కేరాఫ్ అడ్రస్ కావాలనే ఉద్దేశంతో ప్రసార భారతి (Prasar Bharati OTT) ఓటీటీ 'వేవ్స్'ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇందులో 12 కంటే ఎక్కువ భాషల్లో పదికి పైగా కేటగిరీల్లో విభిన్న కంటెంట్లను పొందవచ్చు. వీటిలోనే వీడియో ఆన్ డిమాండ్ కంటెంట్, ఉచిత గేమింగ్, రేడియో స్ట్రీమింగ్ కూడా ఉంటాయి. 65 లైవ్ ఛానెల్స్‌ను వీక్షించవచ్చు.
ప్రైవేట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అనేక ఫీచర్స్‌ను ప్రసార భారతి అందుబాటులో ఉంచింది. ప్రోగ్రామ్స్, గేమ్స్, ఈ-బుక్, భక్తి పాటలు.. అలాగే దూరదర్శన్‌లో ప్రసారమైన అలనాటి రామాయణం, మహాభారతం ధారావాహికలను ఉచితంగా ఇందులో వీక్షించవచ్చు. అంతే మన పెద్దలకు ఎంతో ఇష్టమైన అలనాటి చిత్రాలను, పాటలను ఫ్రీగా చూసేయవచ్చు. రేడియో ప్రసారాలను కూడా వినొచ్చు.
ఇవే కాదు పిల్లల కోసం యానిమేషన్ చిత్రాలను కూడా అందుబాటలో ఉంచింది. తెనాలి రామకృష్ణ, ఛోటా భీమ్, అక్బర్-బీర్బల్ వంటివి వీక్షించవచ్చు.
ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ఐఓఎస్‌లు అందుబాటులో ఉంచింది. ఆలస్యం చేయకుండా.. 1990 కిడ్స్ అందరూ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని..చిన్నప్పుడు దూరదర్శన్‌లో మీరు చూసిన, మెచ్చిన ప్రొగ్రామ్‌లను చూసి మైమరిచిపోండి.